మద్యం దొరకని ఎడిక్ట్ లకు
స్వేటింగ్స్, పాలిపిటేశాన్స్ నే
“ఆల్కహాలిక్ విత్ డ్రాయల్ సింప్టమ్స్”
వస్తాయని ఉహించి
పక్కలేసి పెట్టింది
ఎర్రగడ్డ ఆసుపత్రి!
లెక్క తప్పిందక్కడే!
ఉహ తల్లకిందులైందిక్కడే
మద్యం తాగనోళ్ళు మంచిగున్నారు
సమస్యల్లా మద్యం అమ్మేవాళ్ళకే!
సీసాలు అమ్ముడవక
చేతులు వణకటం మొదలైంది
డబ్బురాక గుండె
డబ్ డబ్ మని కొట్టుకుంటోంది
కొనే వాళ్ళు లేక
కళ్ళు బైర్లు కమ్మినాయి
దాంతో పోయి పిచ్చాసుపత్రిలో పడ్డారు!
వాళ్ళ కోర్సుల్లో
ఇదెక్కడా చదవని డాక్టర్లు
చక్కెరోచ్చి చేతులెత్తేయగా
లీడర్లే మందు కనిపెట్టారు
తెల్లారే దుకాణాలు తెరిచారు!
వందల వైన్ షాపులు
రోగాలు మాయం!
లక్షల మందు బాబుల
ఆరోగ్యం మాయం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి