*తోటలు*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నింగిన మెరిసే తారలు
జలజల కురిసే ధారలు
అమ్మానాన్నల చూపులు
వారంతా పసిపాపలు
పాపలు విరిసిన పువ్వులు
కిలకిల నవ్విన నవ్వులు
నింగిలొ మెరిసిన మెరుపులు
పెద్దల మదిలో మైమరుపులు
జగతికి వారే బాటలు
ప్రగతికి వారే రాటలు
మమతల ముద్దుల మూటలు
మమకారపు సుద్దుల తోటలు!!