అమ్మానాన్నలకు పొలం పనులలో ఆసరా:-వెంకట్ మొలక ప్రతినిధి


 వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన శివరాజ్ శశికళ భార్య భర్తలు పొలంలో విత్తనాలు వేస్తున్న  క్రమంలో కన్న కూతురు భవాని ఒకటో తరగతి చదువుకుంటుంది పాఠశాలలు ప్రారంభం కాలేదు ఇంటి దగ్గర ఏమి చేయలేని పరిస్థితులో తల్లిదండ్రులు పాపను పొలం తీసుకొచ్చారు
జూన్ మొదటి వారంలో తమ పొలము లో శివరాజ్ కంది విత్తనాలు వేశారు అందులో అంతర్ పంటగా జొన్నలు వేయడం మరిచిపోయారు నిన్న కురిసిన వర్షానికి కంది అంతర గా జొన్న విత్తనాలు అదునుచూసి వేస్తున్న క్రమంలో తల్లి కాడే ఏద్దు గా ముందుకు లాగుతూ ఉంటే తండ్రి శివరాజ్ లొట్ట పట్టి విత్తనాలువెస్తువుంటే
కూతురు భవాని  నేను సైతం ఆసరా అవుతానని  గంపలో జొన్నలు నింపుకుని నాన్నతో  పాటు పొలంలో నడుచుకుంటూ వారికి సాయం అందించింది ఈ దృశ్యం చూస్తుంటే భవానినీ
మేచ్చుకోవాలని అనిపించింది అమ్మానాన్నలకు తగ్గ కూతురు గా బడిలో అక్షరాలు నేర్చుకునే తరుణంలో నే పొలం బాటలో పనులని అమ్మ నాన్న ల ద్వారా చిరువయసులో నేర్చుకోవడం భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుకునే అవకాశం మాత్రం కనబడింది మరొకసారి భవాని అభినందిస్తూనేటి చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తున్న భవాని  నీ
మొలక తరపునప్రత్యేకంగా అభినందనలు అందిస్తున్నాం