మంచితనం(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
మంచి చేయుమెపుడును మానవుడవే నీవు
మానవతనే గుర్తు మాన్యుడవు కాగలవు

లోకమున‌ జాడగను లోకులకు అండగను
ఉత్తమ గుణము చూడ ఉర్వియందు నిలువగ

ఊతం సమాజమున ఊర్థ్వ పీఠమునుంచు
మేలే జరుగగలదు మేదినిని‌ మరువకుము

నేర్పవలె పిన్న

లకు నేడిది అవసరమే
సుభాషితమును వినుము సుమతులార విధిగా