*పోనీలే!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.నీవు ఏం చెప్పు! వినం!
   బతుకు కులాసా! భరోసా!
   మిన్ను విరిగి మీద పడ్డా!
   వెన్ను విరిగి నేల పడ్డా!
   మా సమాధానం *పోనీలే!*
2.అంటే అనండి, పోకిరి!
    మొండితనం , వైఖరి!
    వినాలంటే , వాంతి!
    ఆచరించడం,భ్రాంతి!
    నేనో *పోనీలే!* సిద్ధాంతి!
3.ఎవరి మాటో ఏమిటి!
   మా మాటే మేము వినం!
   నిగమశర్మలం! గిరిశాలం!
శిశుపాలురం!భల్లాలదేవుళ్ళం!
మా హృదయనాదం *పోనీలే!*
4. మాకు పెద్ద లక్ష్యాల్లేవు!
  అన్నీకావాలి,అనుభవించాలి!
  పక్కవాడి కష్టం, మాకిష్టం!
 కాకుంటే *పోనీలే!* అంటాం!
5..పోనీ అన్నది పోనీ!
     ఎన్నాళ్లీ బాణి!
  *లే!*  *లేవాలి!*
    బొగ్గయి రగులు!
    అగ్గి అయి వెలుగు!
    కదం తొక్కు!
    పదం పాడు!
    పంతంతో సాగు!
  *ఉన్నావులే!* అనిపించు!
   నిన్ను నీవే మించు!
   అనుక్షణం *ప్రతిధ్వనించు!*