నానీ నానీ నానమ్మ- బాలగేయం :-ఎం. వి. ఉమాదేవి.
నానీ నానీ నానమ్మా !
సెల్ ఫోన్ నాకు వద్దమ్మా !
కళ్ళ నొప్పులు వచ్చాయీ, 
మార్కులు తగ్గి పోయాయి !

సెలవుల్లోన పని చెప్పు 
మొలకలు నాటుట నేర్పించు !
కలవర పడక ఇంటిని సర్దే 
చలాకి కిటుకు నేర్పించు !

రెక్కల గుర్రం కధచెప్పు 
చక్కని పద్యం వల్లించు 
చిక్కని రాగుల జావను చేసి 
చక్కెర వేసి తాగించు !

అమ్మకు సాయం చేద్దాము 
బొమ్మలు కూడా వేద్దాము 
కమ్మని కబుర్లు చెప్పాలే 
నమ్మకమెంతో ఇవ్వాలే!

టీవీ వార్తలే చూడాలి 
నేవీలో నే చేరాలి 
పర్యావరణo కాపాడి 
మర్యాదస్తులు కావాలి !

నానీ నానీ నాన్నమ్మా !
సెల్ ఫోన్ నాకు వద్దమ్మా !