బాలలు-రేపటి పౌరులు:---గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.
అమ్మ ఒడిలో  బాలలు
మమతల మల్లెల మాలలు
కొమ్ముకొమ్మకు కాయలు
మేలిమి బంగరు ఛాయలు

నాన్న ఎదపై పిల్లలు
వెన్నెల వన్నెల జల్లులు
సన్నజాజుల అందాలు
వెన్న ,పెరుగు బంధాలు

తాత ప్రక్కన పాపలు
చుట్టూ మొలసిన మొలకలు
మాటలు చెప్పే చిలుకలు
ముద్దుగ ఒదిగిన గువ్వలు

బామ్మ దగ్గర బాలలు
నింగిలో చంద్రవంకలు
రేపటి భారత పౌరులు
పౌరుషమున్న వీరులు