ఐకమత్యం : - సత్యవాణి

 నందుడనే రైతన్నకు
నాలుగు ఎద్దులు గలవు
ఆ ఎద్దులు నాలుగును
కలసి మెలసి వుండునెపుడు
ఒకదిక్కునె మేతమేయు
ఒద్దికగా ఆ నాలుగు
ఒకనాడా పలంలోకి
వనరాజగు సింహమొచ్చె
బలసిన ఎడ్లజూసి 
బాగున్నవి అనుకొనెను
నాలుగు ఎద్దులను
నాలుగు దనములు నాకై
నచ్చినట్టి ఆహారం
నమిలి మ్రింగి తిందునని
లొట్టలు వేసిన సింహం
ఒక ఎద్దును ఎంచుకొనెను
పట్టబోయి ఆసింహం
పడబోయెను ఎద్దుపైకి
గమనించిన ఆ ఎద్దులు
కలబడె సిహం తోడను
నాలుగు తమ కొమ్ములతో
నలిబిలి చేసెను వెంటనె
తోక ముడిచి ఆ సింహం  
తుర్రుమని పరిగెత్తిపోయె
కొన్నినాళ్ళకా ఎద్దులు
కలహంతో విడిపోయెను
ఎవరికి వారే తీరుగ
ఎచటెచటో మేయసాగె
అది గమనించిన సింహం
అదును చూసిఒక ఎద్దును 
ఒడిసిపట్టె
అది చూసిన మూడెద్దులు
అదిలించలేదు సింహాన్ని
వాటి మధ్య దూరమపుడు
వరమైనది సింహానికి
నాలుగెద్దులావిధముగ
నమిలిమ్రింగె సింహమంత
ఐకమత్య బలమేదో అందరు గ్రహింపగలరు