" హిత హారిక ":---గద్వాల సోమన్న
పచ్చని తరువులు
తరుమును కరువులు
నిలుపును అసువులు
పెంచాలోయ్ !!

గొప్పది సాయము
చేస్తే న్యాయము
దీవెన ఖాయము
చేయాలోయ్ !!

మోమున నవ్వులు
విరిసిన పువ్వులు
వెలిగే దివ్వెలు
నవ్వాలోయ్ !!

ఇంటికి భానులు
కంటికి వెలుగులు
ముద్దుల బాలలు
ఉండాలోయ్ !!

జనకుల సేవలు
తరగని ప్రేమలు
చెరగని గురుతులు
గొప్పోలోయ్ !!

కలలకు శ్వాసలు
తీరే ఆశలు
భువిలో బాలలు
వర్ధిల్లాలోయ్ !!


కామెంట్‌లు