చూపు:--ప్రతాప్ కౌటిళ్యా (( కె ప్రతాప్ రెడ్డి))
గాలి గర్భంలో భూగోళం పెరుగుతుంది
కళ్ళు తయారవుతున్నాయి
చెవుల కర్మాగారాల్లో శబ్దాల ముద్దలు ముద్రిస్తున్నారు !?

క్షణం సేపు రెప్పలు గూళ్ళలోనే దాగి ఉన్నాయి రెక్కలు ఇంకా మొలవాల్సీఉందీ!

ఒక్కొక్క పటం చిత్రిస్తున్న చిత్రకారుని కుంచె నకళ్ళు కావు అవి కళ్ళు
ప్రతి పాత్రలో నటిస్తున్న నటుడు కనుబొమ్మలు లేకుండానే కళ్ళను కాపలా కాస్తున్నాడు !!

కాటే యాలని చూస్తున్న మాట నాలుకకు విషం విరుగుడు ను కన్నీటితో కడిగేసింది!!

కంటిని తక్కువగా అంచనా వేయకు
త్రాగే సింది మకరందం కాదు చందమామ అందం
చెవిలో గుసగుసలాడిన గులాబీ రెక్కలు ముత్యాలు రాలుస్తున్నవి!?

ఉత్తమ నేపథ్య గేయంతో గాయపడ్డ చెవి చుట్టూ పచ్చని చెట్లు మౌనంగా మొలుస్తున్న వి!?

ఒక్కో సారీ దృశ్యాన్ని అదృశ్యం చేసిన చీకటి రేపటి ప్రేమలేఖై కంటిఇంటి ముందు ప్రదక్షిణ చేస్తుంది !?

వస్త్రాలు చుట్టుకున్న నేస్తాలు  పసిపాపలుఆ కంటిపాపలు !?

నదుల్ని పుట్టించిన కంటి చూపు తన ఇంట్లోనే చివరికి కలుస్తుంది
ఆశపడ్డ కళ్ళు రెండు ప్రేమలో పడ్డావీ
ఏమీ ఆశించని అవి ముద్దుల సరిహద్దులు దాటి నిశ్శబ్దంగా ఇంటి ముందు ముద్దమందారాలై పూస్తున్నాయి !?

ఎగిరిపోయిన మాటలు చిగురించిన చిత్రపటాలు చివరి వరకు కలిసిపోయి ఉంటాయి
మేల్కొల్పిన గీతం ఇంకా వినిపిస్తూ నేఉందీ!?

వెలుగు తొలగిపోయింది కంటి చూపు ఇంకా మిగిలే ఉంది
చేతనైతే నీవు నేత్రాన్ని ఆపు విచిత్రం జరిగి తీరుతుంది !?

Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273