ఆరోగ్య భారతం: డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్
కరోనా కనికరం లేకుండా
కాటేసి నా
జీవితం చివరి అంచున
నిలబడినా
ఊపిరాడక ఉక్కిరబిక్కిరై
గాలి కోసం అల్లల్లడుతున్నా
భయడకుండా పోరాటం
సాగించాలి.
కరోనా ను పొలిమేరల దాకా
తరిమికొట్టాలి.

ఒకనాటి భారత దేశం
ప్లేగ్, కలరా,మశూచి ల
భయంకర విశ్వ రూపం
చూసింది.వెళ్లగొట్టింది.
ఇప్పుడు అ

దే ధైర్యం తో
ముందడుగు వేయాలి
కరోనా ను ఖతం చేయాలి.

భవిష్య భారత దేశం
ఆరోగ్యం తో కళ కళ లాడాలి
అనారోగ్యాన్ని కసి కసిగా
కాలి కింద వేసి తొక్కేయలి.
కలల భారతం కల్లోలం కాదు.
ఆరోగ్య భారతం అవుతుంది.