మధురిమలు: - ​పి. హజరత్తయ్య సింగరాయకొండజిల్లా : ప్రకాశం
【01】అమ్మ దైవము
పూజించండి 
నాన్న ప్రాణము
కాపాడండి

2) చీకటి జీవితాలు
 వెలుగులు నింపుతాడు
విజ్ఞాన విషయాలు
బాగా తెలుపుతాడు

3) ఆటంకాలు వచ్చినా
రైతులు సేద్యము సేయును
కష్టములే ఎదురైనా
ధైర్యముతో ఎదుర్కొనును

4) గురువు బోధించగ
శిష్యులు నేర్చును
పెద్దలు చెప్పగ
పిల్లలు మారును

5) తెలుగు భాషను
బోధించండి
 అమ్మ భాషను
కాపాడండి

6) మంచివారితో
స్నేహం చేయుము
చెడ్డవారితో
చెలిమిచేయకుము

7) పిల్లలకు స్ఫూర్తి
పెద్దలు కావాలి
వంశానికి కీర్తి
పిల్లలు ఇవ్వాలి

8) కోపాలు పెరిగిన
అనర్ధాలు జరుగు
ద్వేషాలు ఎదిగిన
అపార్ధాలు పెరుగు

9) అడవిబిడ్డలను
ఆదరించండి
పేదపిల్లలను
చదవనివ్వండి

10)మానవతా విలువలు
మానవత్వం పెంచు
ఆధ్యాత్మిక విలువలు
భక్తిభావము నిచ్చు

11 )నాణ్యమైన భాష
మన మాతృభాష
నుడికారపు భాష
మన తెలుగు భాష

12)రాయలు మెచ్చిన భాష
మన తేట తెలుగు భాష
రాజసం ఉన్న భాష
మన తేట తెలుగు భాష

13)ఆటలు క్రీడాకారునికి
పేరుని తెచ్చిపెట్టాలి
మన భారతదేశానికి
ఖ్యాతిని తెచ్చిపెట్టాలి

14)ఆటలు ఆడితే
ఆరోగ్యం కలుగును
పాటలు పాడితే
ఆనందం పెరుగు

15)అవినీతికి ఎప్పుడూ
దూరంగా ఉండండి
విజయం ఎల్లప్పుడూ
అంటిపెట్టుకొని ఉండు

16) అతిగా మాట్లాడితే
గౌరవం కోల్పోతావు
అతిగా ఆలోచిస్తే
ప్రశాంతత కోల్పోతావు

17) తప్పులు చేస్తే
ఒప్పుకోకండి
ఒప్పులు చేస్తే
 ప్రశంసించండి

18) పిల్లలకు హృదయాన్ని
అర్పించేవారు గురువులు
విద్యార్థుల్లో శక్తిని
వెలికితీసేది గురువులు

19) సమాజాన్ని సంస్కరింప
విచ్చేసినారు గురువులు
సమాజాన్ని ఉద్దరింప
ఎతెంచిన వారు గురువులు

20) జగతికి వెలుగై
మెరియును గురువులు
జాతికి వెలుగై 
నిలుచును గురువులు

21)) నీవు చూసిన ప్రతిది
నిజం కాకపోవచ్చు
నీవు వినేసే ప్రతిది
మంచి కాకపోవచ్చు

22) అతిగా స్పందిస్తే
గుణం నశిస్తుంది
అబద్ధాలాడితె
విలువ తగ్గుతుంది

23) విజయానికి మించిన
ఆనందమే లేదు
త్యాగానికి మించిన
గొప్పదనమే లేదు

24) ఎవరూ చేయకూడనిది
నమ్మకమైన ద్రోహం
బ్రతికి ఉన్న చంపేది
మానవుడు చేసే మోసం

25) జన్మనిచ్చేది
జననీ జనకులు
బ్రతుకునిచ్చేది
గురు భగవానులు

26) మానవ సమస్తానికి
ఆయుధమే అక్షరం
మానవాళి ప్రగతికి
రథచక్రం అక్షరం

27) దేశముఖ్ అహామును
దెబ్బతీసె ఐలమ్మ
వెట్టిచాకిరి పనిని
నివారించె ఐలమ్మ

28) కఠినమైన మాటలు
మనసు గాయపరుచును
తప్పుడు అబద్ధాలు
అనుబంధం తెంచును

29) ధర్మం తప్పిస్తే
వినాశనం తప్పదు
ధనాన్ని సాధిస్తే
అనర్థమూ తప్పదు

30) వర్షం కురిస్తే
ప్రకృతి పులకించు
వెన్నెల కురిస్తే
పుడమి పరవశించు
31) వేదం చదివితే 
ధర్మాలు తెలియును
వైద్యం చదివితే
రోగాలు తెలియును

32) బంధం నిలవాలంటే
అనురాగాలు ఉండాలి
స్నేహం నిలవాలంటే
నమ్మకాలే పెరగాలి

33) వెతుక్కుంటూ వెళ్ళకు
అవమానం పడతావు
ఎదురుచూస్తూ ఉండకు
మోసగించ బడతావు

34) పుణ్యం రావాలంటే
దేవుని నమ్ముకోవాలి
పాపం కావాలంటే
మనిషిని నమ్ముకోవాలి

35) కఠినమైన మాటలు
క్రోధమును కలిగించు
మధురమైన మాటలు
కోపమున చల్లార్చు

36) కష్టాల్లో ఉన్నప్పుడు
నిన్నూ పట్టించుకోరు
విజయాల్లోఉన్నప్పుడు
నిన్నెవరూ వదులుకోరు

37) కత్తి చేసే గాయం
లోతు చాలా తక్కువ
మాట చేసే గాయం 
లోతు చాలా ఎక్కువ

38) ఒకరు బాధ పడుతుంటే
వేరోకరు నవ్వుతారు
మనం బాగు పడుతుంటే
మనవారు ఏడుస్తారు

39) మన వెంట ఉంటూనే
దొంగ దెబ్బ తీస్తారు
మనతో తిరుగుతూనే
నాశనం కోరుతారు

40) పువ్వు దేవుని చెంతకు
చేరాలను కుంటుంది
మేఘం పంటల కొరకు
కురవాలను కుంటుంది

41) తప్పులు చేసే వాడిని
మన్నించడం నేర్చుకో
మోసం చేసిన వాడిని 
క్షమించట అలవర్చుకో

42) పోరాడేవాడు
నిజంగా గెలిచాను
పడమరన సూర్యుడు
తిరిగి ఉదయించును

43) చక్కగా మాట్లాడితే
మంచి శుభం జరుగుతుంది
చెడ్డగా మాట్లాడితే
అనర్థం ఎదురవుతుంది

44) ప్రేమ వివాహాలను
ఆశిర్వదించ వలెను
వివాహా బంధమును
ఆస్వాదించ వలెను

45) కష్టాల్లో ఉన్నప్పుడు
మనసు గట్టెక్కించాలి
బాధలో ఉన్నప్పుడు
ధైర్యాన్ని నింపేయాలి

46) పాతాళంలో పడ్డా
ధైర్యము ఉంటే లేస్తాం
చిన్న గుంతలో పడ్డా
అధైర్యముంటే చస్తాం

47) సవాలు స్వీకరించి
నిన్ను నిరూపించుకో
గుణపాఠాలు పాటించి
నిన్ను బాగా చేసుకో

48) చేదు జ్ఞాపకాలను
వదిలి ముందుకు సాగు
రోజు మంచిదైనను
మనకు బాగా సాగు

49) పోరాడిన గెలుపుకు
అవకాశము ఉండును
ప్రయత్నిస్తే నీకు
ఓటమి తప్పవచ్చును

50) ఇల్లు మురియాలంటే
బాధ్యతతో మెలగాలి
మనం ఎదగాలంటే
బుద్ధి బలం చూపాలి

51) గెలుపు కోరుకునే వారు
ప్రయత్నం విడిచిపెట్టరు
ప్రయత్నం విడిచే వారు
గెలుపును సాధించ లేరు

52) ఆహారం కొనగలం
ఆకలిని మనం కొనలేం
మన జనాన్ని కొనగలం 
ఆత్మీయులను కొనలేం

53) జనం దృష్టి యందు
గొప్పగ నడవాలి
మనఃసాక్షి ముందు
ముందుకు సాగాలి

54) ఒకరిని బాధ పెట్టడం
చాలా సులువైన పని
వారిని సుఖ పెట్టడం
మనకు కష్టమైన పని
55) నీవు ఖర్చు చేయవచ్చు
డబ్బులను ఎలాగైనా
నీవు పొదుపు చేయవచ్చు
సమయాన్ని కొంచమైనా

56) బాగా బండి లాగినా
ఎద్ధుకు దెబ్బలు తప్పవు
గొప్పవాడిగ ఎదిగినా
విమర్శలు మనకు తప్పవు

57) ఏ బంధం అయినా
నీడలా ఉండాలి
అనుబంధం అయినా
మంచిగా ఉండాలి

58)కాటు వేసే పాముకే
జనాలు పాలు పోస్తారు
నీడ నిచ్చే చెట్టుకే
 నీళ్ళను కూడా పోయరు

59) అర్థం చేసుకోవాలి
ఎదుటి వారి పరిస్థితులు
నాణ్యత తెలుసుకోవాలి
కొనేముందు వస్తువులు

60) మంచి చెప్పిన వాడు
ఎప్పుడు చెడ్డోడే
చెడును చెప్పిన వాడు
ఎప్పుడు మంచోడే

61) చనువు ఎక్కువైతే
సంస్కారం ఉండదు
బంధాలు ముదిరితే
విడిపోవుట తప్పదు

62) తల్లి సంతోష పడును
పిల్లలు ఎదుగుతుంటే
తండ్రి ఆనంద పడును
బిడ్డను పొగుడుతుంటే

63) తప్పు చేస్తే చెప్పడం
చాలా సులభం మనిషికి
తప్పు చేస్తే నేర్పడం
చాలా కష్టం మనిషికి

64) ప్రేమ ఉంటే సరిపోదు
అర్థం చేసుకుంటుండు
ధనం ఉంటే సరిపోదు
సహాయం చేస్తూ ఉండు

65) మంచి మనసుతో చెప్పే
ప్రతి మాట విలువైనదే
మంచి ఆశించి చెప్పే
మనస్సు అందమైనదే

66) యుద్ధం ఎప్పుడు వచ్చిన
సిద్ధంగ ఉండు జవాను
ఎలాంటి సమస్య వచ్చిన
పోరాడు వీర జవాను

67) జీవితాన విలువైనది
నలుగురు మెచ్చుకోవడం
జీవితాన్ని కష్టమైంది
చనిపోయి జీవించడం

68) ధనం సాధించడానికి 
మనకు దారులు అనేకం
గుర్తింపు పొందడానికి
పడు కష్టం ప్రత్యేకం

69) చివరి రోజు అన్నట్టుగ
పూర్తిగా జీవించండి
నిలిచి ఉండేటట్టుగ
జ్ఞానాన్ని ఆర్జించండి

70) లక్ష్యమే గొప్పదైతే 
కష్టం నిను బాధించదు
ఆశయం మంచిదైతే
కష్టం నేను ఎమిచేయదు

71) నమ్మకం లేకపోతే
అనుబంధాలే ఉండవు
గౌరవం లేక పోతే
బంధుత్వాలు నిలబడవు

72) డబ్బులున్న వారికి
మనుషుల తోడుగుండు
గుణం ఉన్న వారికి
దేవుడు అండ గుండు

73) సంపాదిస్తూ పోతే 
అందరికి ఆత్మీయులం
సంపాదనే ఆగితే
అందరికీ కాని వాళ్ళం

74) విషాన్ని చిందించ గలవు
మన కఠినమైన మాటలు
అమృతమ్మును పంచగలవు
మన మధురమైన మాటలు

75) కోపం వచ్చినపుడే
మనస్సుతో పోరాడు
సమస్య వచ్చినపుడే
కాలంతో పోరాడు

76) దీక్షలు ఆరోగ్యములను
బాగా శుద్ధి చేస్తుంది
క్షమాపణలు బంధాలను
వికసించేల చేస్తుంది

77) చీకటిలో ఉన్నప్పుడు
వెలుగు ధైర్యానిస్తుంది
కష్టంలో ఉన్నప్పుడు
ఓదార్పు బాగుంటుంది
78) చెట్టు యొక్క సారం
పండులో వ్యక్తమగు
మనిషి యొక్క సారం
మాటలో వ్యక్తమగు

79) మంగళకరమైన మాట
సంస్కారానికి చిహ్నం
మనిషి మాట్లాడే మాట
వ్యక్తిత్వానికి చిహ్నం

80) మంచి చెప్పే వారు 
చాల మంది ఉన్నారు
మంచి చేసే వారు
తక్కువగా ఉన్నారు

81) ఉత్సాహంతో శ్రమించు
మనకు విజయం చేకూరు
ఆనందంగ జీవించు
ఆరోగ్యం ఉండి తీరు

82) మంట చల్లార్చడానికి
తియ్యనీ మాటలు చాలు
భరోసా ఇవ్వడానికి
నేస్తం దొరికితే చాలు

83) ఆకులు రాలిన చెట్టుని
ఎవ్వరూ పట్టించుకోరు
అవసరం లేని మనిషిని
వదిలించేసుకుంటారు

84) సలహా ఇచ్చేటప్పుడు
విచక్షణ పాటించాలి
స్వీకరించాల్సినప్పుడు
వినమ్రంగా ఉండాలి

85) ఎప్పుడు బాధపడుతుంటే
జీవితం భయపెడుతోంది
ధైర్యంగ ఎదుర్కొంటే
జీవితం బాగుంటుంది

86)) జ్ఞాన మున్న వాడి మాట
తప్పక ఆచరించాలి
అనుభమున్న వాడి మాట
తప్పకుండగా వినాలి

87) ఇతరులతో పోల్చితే
సమస్యలు పెరుగుతాయి
పోల్చడాలు వదిలితే
సమస్యలు తొలుగుతాయి
88) సంపదలతో పని లేదు 
జ్ఞానం కలిగిన వారికి
ఆయుధంతో పని లేదు
కరుణే కలిగిన వారికి
89) మాట భయంకరమైన
మౌనాన్ని తరిమి వేయు
ఒక్క చిన్న చిరునవ్వు
దుఃఖాన్ని చెరిపి వేయు

90) ఒంటరిగా నడువుటమే
కష్టంగా ఉండవచ్చు
కానీ ఒంటరితనమే
మనకు మంచిది కావచ్చు

91) అమ్మ మమకారానికి
నోచుకోరు అనాధలు
ఆత్మీయుల మమతలకి
నోచుకోరు అభాగ్యులు

92) బంధం తెంచే శక్తి
కోపానికి ఉంటుంది
బంధం కలిపే శక్తి
ఒక చిరునవ్వుకు ఉంది

93)నీవు బలవంతుండవని
విర్రవీగుట మానుకో
నలుగురూ మోస్తే గాని
వెళ్ళ లేవని తెలుసుకో

94) కుల నిర్మూలన కోసం
కృషి చేసినాడు పూలే
పేదల హక్కులకోసం
పోరును సల్ఫెను పూలే

95) మానవీయ భావాలు
విచ్ఛిన్నమై పోయెను
మానవీయ బంధాలు
అస్తవ్యస్త మయ్యెను

96) కార్తీక మాస దానాలు
తొలగించు మన పాపాలు
పౌర్ణమి నాటి దీపాలు
అందించు మనకు ఫలాలు

97)కార్తీక మాసం మనకు
సకల సంపదలను ఇచ్చు
కార్తీక పౌర్ణమి మనకు
కొండంత పుణ్యానిచ్చు

98) చదువుకున్న ప్రతి వారు
సంస్కారవంతులు కారు
చదువు లేని ప్రతి వారు
సంస్కారహీనులు కారు

99) దైవప్రార్థనలే
శుభాలన్ని ఇచ్చును
మంచి స్నేహితులే
మనకు మేలు చేయను

100)సాధించాలనే తపన
విజయం వైపు నడిపించు
నేర్చుకునే ఆలోచన
బలహీనత అధిగమించు

101) నమ్మకం ఏర్పాటుకి
పట్టును పదికాలాలు
నమ్మకం పోడానికి
సెకను మాత్రమే చాలు

102) వీచే వాసనను బట్టి 
 పూలపై ఇష్టము కలుగు
మాట్లాడు మాటలు బట్టి
మనపై గౌరవం పెరుగు

103)బాధలో ఉన్నవారికి
ఓదార్పును అందించు 
కష్టంలొ ఉన్న వారికి 
కొంచెం సాయమందించు

104)మంచి మంచు లాంటిది
రోజు రోజుకు కరుగు
కీడు చెత్త లాంటిది
రోజు రోజుకు పెరుగు

105) కళ్లతో చూసే ప్రతిది
నిజమనుకోవడం తప్పు
మన చెవితో వినే ప్రతిది
నిజమనుకోవడం తప్పు

106) రామాయణ కావ్యము
నిత్య పారాయణము
శ్రీ రాముని నామము
సకల పాప హారము

107) తెలుగు కవిత్వానికి
వేగుచుక్క శ్రీ శ్రీ
శ్రామికుల ఐక్యతకి
గళమెత్తెను శ్రీ శ్రీ

108) పుస్తకం గురువు లాంటిది
మార్గమును చూపిస్తుంది
పుస్తకం అమ్మలాంటిది
మనల్ని ఆదరిస్తుంది

109) గోటితో పోయేదాన్ని 
 గొడ్డలి దాక తేబాకు 
 మాస్కుతో పోయేదాన్ని 
 మరణం దాక రానీకు

11 0) ప్రయత్నించే వారు 
విజయం వదులుకోరు
ప్రయత్నించని వారు
విజయం అందుకోరు