అర్హత పత్రం:- సునీతా ప్రతాప్
మనిషి
యుద్ధం చేయాలంటే
ఇద్దరు కావాలి !?
సిద్ధాంతం కావాలి!?

కానీ
నీవు యుద్ధం చేయాలంటే
నిన్ను నీవు జయించాలి
నిన్ను నీవు ఓడించాలి
నీకు నీవే మరణించాలి !?

మనిషి
ప్రకృతికి అతీతమేంకాదు
పరిస్థితికి అతీతం కాదు !?

మనిషిమనోభావాలు
భావోద్వేగాలే అవీ
మనిషికున్న భయాలు బలాలు బలహీనతలే అవీ!?

మనోభావాలతో యుద్ధం చేస్తున్నది ఎవరు!
మనోభావాలతో వ్యాపారం చేస్తున్నది ఎవరు!?
మనోభావాలతో భావోద్వేగాలతో గద్దెనెక్కతున్నదెవరు !?

ఓం ఓంకారం అహంకారం వీడాలి
ప్రకృతి  మనిషికి ఇచ్చిన ధ్రువ పత్రం శాస్త్రం

మనిషి మనసుకు ఇచ్చిన అర్హత పత్రం మానసిక శాస్త్రం అదే రహస్యం అంతే !?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
Sunitapratap
9309529273