కరోనా వైద్యులు- మొగ్గలు :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
తొలి పరీక్షల సమయంలోనే 
గుండెధైర్యం కరోనా వైద్యులు !
అంకితభావం వీరి సేవారూపం!

 రోగం గుట్టును తెలుసుకుంటూ 
బాధితునికి సత్వర సేవలిస్తారు 
దేవుని హస్తాలే వైద్యం విధిగా !

సమాజపు రక్షణ భుజాలపైనే 
మనసులో వ్యాధి నిరోధకత!
ఆహార,నిద్రావస్తలు మరచారు!

రోగం,రక్షణ రెండు కళ్ళుగానే 
అనుక్షణ అప్రమత్తం వైద్యులు!
దశల వారీ వ్యాధి నిరోధకులు !

కుటుంబాన్నే త్యాగం చేస్తూనే 
ధృఢ నిశ్చయంతో వీరి సేవలు!
కరోనా వైద్యులు సంజీవనులు !

సేవల్లో వ్యాధికి గురవుతూనే 
దయనీయ స్థితిలో వైద్యులు!
ప్రాణం అడ్డుపెట్టిన అమ్మలు!

 నియంత్రణ తప్పక చేస్తూనే 
అదే నివాళిగా నమస్కరిద్దాo 
దేశఋణం తీర్చేరు వైద్యులు !


కామెంట్‌లు