బాలగేయం:- సత్య వాణి
పాఠశాలకూ వెళ్ళేటప్పుడు
టాటా చెపుతాను

దారిలో టీచరు కనబడినప్పుడు
దణ్ణం పెఢడతాను

వందేమతరం పడేటప్పుడు
వరుసలో నిలబడతా

పేర్లు వరు‌సగా పిలిచేటప్పుడు
జై హిందంటాను

గురవులు పాఠం చెప్పేటప్పుడు
శ్రధ్ధగ వింటాను

జనగణమన అని పాడేటప్పుడు 
కదలక నిలబడతా

దేశమాతను పూజిస్తా
దేశగౌరంవం చాటేస్తా