మనందరికీ జురాసిక్ పార్క్ సినిమా చాలా ఇష్టం కదూ?మరి దాని దర్శకుడు స్టీవెన్ స్పిల్ బెర్గ్ గురించి తెలుసు కుందాం. తల్లి ప్రోద్బలంతో బాల్యం నించే సినిమాలు తనే స్వయంగా తీయటం మొదలు పెట్టాడు.తన పన్నెండవ ఏట దిలాస్ట్ గన్ అనే సినిమా నిర్మించాడు. షార్ట్ ఫిల్మ్ ఖర్చు కోసం చెల్లెలు పాప్ కార్న్ అమ్మేది.మొక్కల వ్యాపారంతో డబ్బు కూడబెట్టాడు. ఫ్రెండ్స్ చూశాక వారికి తోచినంత డబ్బు చేతిలో పెట్టేవారు. ఆఫ్రికా లో జరిగిన యుద్ధం ఆధారంగా 40నిమిషాల సినిమా తీసిబహుమతి పొందాడు.తన 18వ ఏట స్వయంగా రచన డైరెక్ట్ చేసిన40నిమిషాల ఫైర్ లైట్ అనే సైన్స్ ఫిక్షన్ మంచి పేరు సంపాదించింది. 22వ ఏట జాస్ అనే వైట్ షార్క్ పై తీసిన సినిమా సంచలనం సృష్టించింది. 1975లో వచ్చిన అది బెస్ట్ అమెరికన్ సినిమా. వైట్ షార్క్ తమమీద పడుతోందని హాల్లో జనం భయం కేకలు తో బెంబేలెత్తారు. ఏలియెన్స్ అనే గ్రహాంతరవాసజీవులపై ఊహతో చిన్నారి ఏలియన్ తో ఒక పిల్లవాడి స్నేహం ని చిత్రించాడు.ఏలియన్ దయ స్నేహం ఆప్యాయత ఉన్న ప్రాణి అనిచూపాడు.ఇటీ అనే పైన డిప్ప లేని ఒక తాబేలు ని పాత్ర గా మలిచాడు.ఇటీ ద్వారా జంతువుల పట్ల పిల్లలకి అవగాహన ప్రేమ అభిమానం పెరగాలని అతని ఆశయం.1993లో వచ్చిన జురాసిక్ పార్క్ లో కంప్యూటర్ పరిజ్ఞానం తో డైనోసార్ని సృష్టించి హాలీవుడ్లో మహారాజు గా మారాడు. మనరామాయణ భారత భాగవతాలలో అద్భుత పాత్రలున్నాయి.మనవారు తీసిన పౌరాణిక సినిమాలు చూస్తే మన గొప్పతనం తెలుస్తుంది. ఆంగ్లంలో వాటిని తీస్తే అందరినీ అలరిస్తాయి.మన కవులు రాజప్రాసాదాలవర్ణన రాక్షసుల రావణాసురుని లంక మయసభ వర్ణన అద్భుతం. మాయాబజార్ ఇప్పటికీ మనలని అలరిస్తూనే ఉంది. మీరు కంప్యూటర్ నాలెడ్జ్ తో భారతదేశ గొప్ప తనం తెలిపే ప్ర యత్నాలు చేయండి మరి.
స్టీవెన్ స్పిల్ బెర్గ్...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి