చిలుకమ్మ. సందేశం:--గద్వాల సోమన్న
పచ్చని తనువు చిలుకమ్మ
ఎర్రని ముక్కు చిలుకమ్మ
వాలెను చెట్టుపై ముద్దుగ
తీపి పలుకుల చిలుకమ్మ

జామ కాయలు చూసింది
వాటి చెంతకు చేరింది
సంతోషంగా కొరికింది
ఆకలి తీరి ఎగిరింది

కింద పాపను గాంచింది
స్నేహము కాస్త చేసింది
జామ కాయను ఇచ్చింది
పాపకు చిలుక

నచ్చింది

పెద్దల మాట వినమంది
బుద్దిగా చదువుమంది
హద్దులు మీరక బ్రతుకున
శుద్ధిగా బ్రతకమంది

కామెంట్‌లు