ధర్మదేవత(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
ధరణికి‌ తాపమెక్కి ధర్మమును‌ తప్పినది
తూట్లు పొడుచు జనులను తూటాలై చీల్చినది

జనులు చేయు పనులకు జాఢ్యముల పాలైనది
పచ్చదనం నశించి పాడుపరచిన ప్రజల

అండగా నిల్చినను ఆశతో దునుమాడి
వనములు లేక విసిగి వానలు లేక అలిగి

భూగర్భ జలాలను భూరిగ ఇంకనీయ
ప్రతిన బూన వలయును ప్రజలు అనవరతముగ