మంచి మనసులు ఉండబట్టే ఈ లోకంలో మానవత అంతో ఇంతో మిగిలి ఉన్నది..!?
కరిగిపోతున్న కాలాన్ని అడుగు ఎందరు మహనీయులను అది చవిచూసినదో..!??
ఏ కొద్ది పాటి అలజడికి మొత్తం మానవత్వాన్ని శంకించకు.., కాస్తో,కూస్తో లోకం లో మానవత్వము మిగిలి ఉన్నదన్న విషయాన్ని మరవకుమా..మిత్రమా..!??
పూలు సైతం ముళ్ళతో పెనవేసుకొని,బంధాలను నెలకొల్పి మరీ.. ఉంటున్నాయి.,అంతమాత్రాన పూల సొగసును,సుమధురిమను..విలువ లేనివిగా,ముళ్ళను చెడ్డవిగా పొరబడకు..!? కంచెలా ఉంటూ మేలు చేస్తున్నాయి..!??
మంచి..మంచే ,చెడు చెడే..!
మంచి యన్నది ఉన్నప్పుడు చెడు ఉండి తీరుతుందని గ్రహించు..! మానవత్వం పూర్తిగా సమసిపోలేదని తెలుసుకో..!??
మంచి మనసులు(కవిత)--ముహమ్మద్ ముస్తఖీమ్ "విన్నర్"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి