బువ్వ పెట్టు తాతా -బాలగేయం:-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
బువ్వ పెట్టు తాతా
బువ్వలే  పెట్టు !
కుక్క పిల్ల మనసులో 
విశ్వాసం నిలబెట్టు !

 మొక్క నాటు తాతా 
మొక్కలే నాటు 
చిక్కులు లేని ఊపిరికి 
చక్కని చోటు !

పాట పాడు తాతా 
పాటలే పాడు !
పాటు పడిన దేశవీర 
గీతం పాడు !

కథలు చెప్పు తాతా 
కథలే చెప్పు !
పేదరాశి పెద్దమ్మల 
ఇంటి దారి చెప్పు !

మాటలు చెప్పు తాతా 
మాటలే చెప్పు !
విజయాలకు దారి తీసే 
మార్గం చెప్పు !