మణికర్ణిక మెరుపులు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
కర్హాడి కుటుంబంలో 
చిన్నారి బాలిక 
నాలుగేళ్ల వయసులో 
అమ్మలేని మణికర్ణిక !

ఆంగ్లేయుల పాలనకు 
వ్యతిరేకంగా పోరాడే 
మొదటి స్వాత్రంత్రయుద్ధముకు 
రథసారధిగా నిలబడే !

భారతచరిత్రలో ధైర్యశాలిగా 
ఝాన్సీలక్ష్మిబాయి కీర్తి 
చరిత్రలో నిలిచెనుగా
భావితరాలకు స్ఫూర్తి !

విలువిద్య తుపాకీని
కత్తిసాము గుర్రపుస్వారి 
కర్రసాము నేర్చుకోని 
మహిళామణి విజయభేరి!

కదనరంగాన కదిలేపులి 
శత్రువుల దునుమాడి
స్వేచ్ఛ కోరేకోమలి 
కూలెనయ్యో మోసపుదాడి!

త్యాగం ప్రతాపము 
చెరగని ముద్రగా 
ఝాన్సీకోట ఘనము 
చరిత్రలో నిలువగా!


కామెంట్‌లు