*ఆదాయం-అపాయం*:డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 1.అప్పనంగా వచ్చే ఆదాయం!
   అపాయం తెచ్చే ఉపాయం!
  "ఒక రాష్ట్రంలో,ఒక్క రోజులో,
   మద్యం అమ్మకాలు,
   164 కోట్ల ఆదాయం!"
  ఇది వార్తా! ఓ పెద్ద వాత!
2.ఎకౌంట్లలో పడే ధనం!
    కష్టం తెలియని "ఇన్ కం!"
   జనం సమ్మోహనం!
   వ్యసనానికి ఇంధనం!
   ఆరోగ్య నాశ ఔషధం!
3.కుడి చేత్తో ఇస్తారు!
    మద్యం ఎరవేసి,
    ఇచ్చింది, నీకున్నది, మొత్తం,
    ఎడం చేత్తో దోచేస్తారు!
  నీ బతుక్కి దారిద్ర్యం కావలి!
  చివరికి జీవితం బలి!
4.వేటగాడు నూకలు జల్లాడు,
    పక్షులు వచ్చి వాలాయి!
    వలలో చిక్కుకున్నాయి!
    విలవిలలాడుతున్నాయి!
5.సంపాదన!
    స్వార్జితం!
    కష్టార్జితం!
    అదే పక్కా!
  జీవితం నడుస్తుంది ఎంచక్కా!
  పక్కనుంచి వచ్చిందో!
  పతనానికి పక్కే!

కామెంట్‌లు