ఉపాధ్యాయుడికి “ రాజశ్రీ” పురస్కారము


 ప్రకాశంజిల్లా, సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ పిల్లి.హజరత్తయ్య గారికి "రాజశ్రీ" పురస్కారం లభించింది.అఖిల భారతీయ సాహిత్య పరిషత్, మంచీర్యాల జిల్లా శాఖ వారి ఆశీస్సులతో నడుస్తున్న 'రాజశ్రీ' అనే నూతన సాహిత్య ప్రక్రియలో శతాధిక వచన కవితలు పూర్తి చేసినందుకు శ్రీ పిల్లి.హజరత్తయ్య గారి సాహితీ కృషిని ప్రశంసిస్తూ "రాజశ్రీ" పురస్కారం ప్రధానం చేయడమైనది
'రాజశ్రీ' నూతన తెలుగు కవితా ప్రక్రియను రూపొందించిన శ్రీ దబ్బెట రాజమల్లు గారు
అంతర్జాలం ద్వారా ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. దాదాపు 500 పైగా వచన కవితలు అనేక ప్రక్రియలు రాసిన హజరత్తయ్య ఇప్పటికే 1)మెరుపు రత్న,2) వెలుగు దివ్వె,3)కవనబ్రహ్మాస్త్ర,4)సృజన ద్రష్ట 5)శత తేనీయ పురస్కార్ 6)నవరత్న పురస్కార్ 7)మధుర కవిభూషణ 8) హరివిల్లు కవిమిత్ర వంటి బిరుదులను పొందియున్నారు.
నేడు  "రాజశ్రీ " పురస్కారము అతనిని వరించింది ఈ సందర్భంగా సాహితీప్రియులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హజరత్తయ్య గారికి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సాహిత్య రంగంలో ప్రోత్సహిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు