నవ తెలంగాణా -మెరుపులు -- పద్య. ప్రక్రియ :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ఎన్నియుగముల నిరీక్షణమిది 
నవ్య రాష్ట్రము కొలువుతీరెను 
తెలంగాణా ప్రజలఆశిది 
హాయిగొలిపే విజయగాథను!

యాసబలమున యావన్మంది
సొంతగడ్డను కోరుకొనిరీ 
పోరుబాటను సఫలమునంది
అధికఫలితం అందుకొనిరీ !

రాజకీయపు శక్తులవియే 
రక్కసులవలె నడ్డుపడగా 
ఏకమైనది సంఘమదియే 
సొంతగడ్డను సాధించగా!

కవులులేరని కొక్కిరించిన 
అహంకారం కవులమాటకు 
గుబులురేగిన మహాప్రతిన 
సురవరంగా జయముకవులకు!

వెలికితీసిన జ్ఞానమంతయు 
చిలికెకవనము చిందులేయగ
జానపదమును మెచ్చునంతయు 
గజ్జికట్టిన కంబళీయగ!

దొరలదోపిడి చెల్లిపోయెను
ప్రజారాజ్యం కొలువుదీరే 
బంగరంటిది బతుకుపండెను 
పూలసింగిడి పుణ్యమమరే !