మెరుపులు:- హజాహారత్తయ్య పిల్లి
1) ఆటల వలన
ఆరోగ్యము వచ్చును
పాటల వలన
ఆనందం కలుగును

2) ఆడడం వలన
కండరాలు పెరుగును
ఆటల వలన
ఏకాగ్రత పెరుగును

3) క్రీడల్లో చురుకుగా
అందరూ పాల్గొనాలి
ఆటల్లో క్రీడాకారునిగా
సత్తా చాటాలి

4) శారీరిక సౌష్టవము
వ్యాయామంతో సాధించు
మానసిక వికాసము
యోగాతో సిద్ధించు

5) గురువుల కితాబునందుకున్న
ఘనుడు గిడుగు
పుస్తకాలు రాసిన
మహోన్నతుడు గిడుగు

6) తెలుగును సామాన్యులకు
చేరువచేసినాడు గిడుగు
సవరభాషను గిరిజనులకు
అందించినాడు గిడుగు

7) తెలుగు జాతీయాలు
తెలుసుకో విద్యార్థి
తెలుగు సామెతలు
నేర్చుకో విద్యార్థి

8) తెలుగు భాష
నీకు తెలివినిచ్చు
మాతృ భాష
మనకు వెలుగునిచ్చు

9) ఎలా తెలుపను
తెలుగు గొప్పదనము
ఏమని వర్ణించను
తెలుగు ప్రాశస్త్యము

10) పచ్చని పొలాలు
ప్రకృతికి అందం 
తెలివి తేటలు
మనిషికి అందం

11) మాట పొదుపు
బంధాలను పెంచును
మనసు అదుపు
సాటిమనసును ఓదార్చను

12) రథచక్రాలు
విరిగిన కర్ణుణ్ణి
విగత విద్యలు
ఏంచిన ఏకలవ్యుణ్ణి

13) మొన్న ఓడినా
నిన్న గెలిచావు
నిన్న పడినా
నేడు లేచావు

14) చీమను చూసి
పట్టుదల నేర్చుకో
పక్షులను చూసి
క్రమశిక్షణ తెలుసుకో

15) భూమాతను చూసి
ఓర్పు అలవర్చుకో
తరువును చూసి
ఎదగడం తెలుసుకో

16) పట్టుదల ఉంటే
అవకాశాలు అందుకోవచ్చు
కృషి ఉంటే
శిఖరాలు అధిరోహించివచ్చు

17) నిన్ను నన్ను
నడిపేది నమ్మకమే
మన అందరిని
నడిపించేది ఆత్మవిశ్వాసమే

18) ఆశయం గొప్పదైతే
 ఆచరణాత్మకమౌతుంది
ఆత్మవిశ్వాసం ఆయుధమైతే
విజయం వరిస్తుంది

19) ఆత్మీయులతో పంచుకుంటే
సంతోషం రెట్టింపవుతుంది
స్నేహితులతో పంచుకుంటే
విషాదం సగమవుతుంది

20) విజయాన్ని ఎవరైనా
కష్టపడే సాధిస్తారు
ఓటమిచెందిన వారైనా
శ్రమించే వాడుతారు

21) కాలానికి విలువనిస్తే
మనవిలువ పెరుగుతుంది
డబ్బుకు విలువనిస్తే
మనవిలువ తగ్గుతుంది

22) మంచిని కోరేవారు
దొరకడం అదృష్టం
నాశనం కోరుకునేవారు
ఉండటం దురదృష్టం

23) అతిగా ఆలోచిస్తే
ప్రశాంతతను కోల్పోతావు
అతిగా ఇష్టపడితే
విలువను కోల్పోతావు

24) జీవితం నేర్పేది
అనుభవ పాఠం
గురువు నేర్పేది
గుణపాఠం

25) అతిగా మాట్లాడితే
గౌరవాన్ని కోల్పోతావు
అతిగా ఆవేశపడేతే
సంతోషాన్ని కోల్పోతావు

26) మధుర పద్యము
మనతెలుగు సొంతం
కమనీయ వచనము
వర్ణనాతీతం

27) మంచితనం ఎక్కువైతే
శత్రువులు పెరుగుతారు
మంచతనం తగ్గతే
మిత్రులు పెరుగుతారు

28) కన్నీటి బొట్టు
బరువుగాఉండదు
కన్నీటి బాధ
బరువుగా ఉంటుంది

29) అవసరం తీరితే
కొద్దిమంది మాట్లాడతారు
అవసరం వస్తే
చాలామంది మాట్లాడుతారు

30) గెలిస్తే తెలుస్తుంది
కావలసినవారున్నారని
ఓడితే తెలుస్తుంది
ఎంతమంది మనకున్నారని

31) పలుకుబడి సాధిస్తే
పలకరించేవాళ్ళు వస్తారు
డబ్బు పోతే
దగ్గరకు ఎవరూరారు

32) నీడనిచ్చే చెట్టుని
ఎన్నడూ మరువకు
ప్రాణమిచ్చే స్నేహితుని
ఎప్పటికీ దూరంచేసుకోకు

33) అబద్ధమాడడం వలన
నమ్మకం పోతుంది
నిజాలు చెప్పినా
నమ్మకం తిరిగిరాదు

34) విజయాలు జీవితంలో
ఉన్నతస్థితికి చేర్చును
ప్రవర్తన హృదయాల్లో
చెరగని ముద్రవేయను

35) రైతులు వోలే
ఆరుగాలం కష్టపడిండి
ఉద్యోగులు వోలే
పనినేప్రాణంగా భావించండి

36) మన ప్రయాణం 
పరలోకానికే గదరా
మన కష్టార్జితం
పరులుపాలే గదరా
37) భోగ భాగ్యాలు
శాశ్వతం కావు
సిరి సంపదలు
అంటిపెట్టుకొని ఉండవు

38) బ్రాండెడ్ బట్టలు
బ్రతుకును కాపాడలేవు
బంగారు ఆభరణాలు
జీవితాన్ని అందించలేవు.

39) మహనీయులు లాగా
మానవత్వాన్ని కలిగిఉండండి
మేధావులు లాగా
జ్ఞానాన్ని పెంచుకోండి

40) సంపాదించిన ఆస్తిని
నీవే అనుభవించారా
ఆకలితో అలమటించేవారిని
కొద్దిగా పట్టించుకోరా

41) భోగ భాగ్యాలు
కనులు తెరిచేంతవరకే
మనిషి బ్రతుకులు
కాటికి వెళ్లేవారికే

42) నాదిఅనుకున్నది
ఏది నీదికాదన్నా
నాకొద్దు అనుకున్నది
నీదేను అన్న

43) అన్నీ శాశ్వతమని
తలచేవు ఏలనోయ్
నిజం తెలిసినా
ఒప్పుకోవు దేనికోయ్

44) ఐస్ లా కరిగిపోయే
ఐశ్వర్యం వద్దు
మహోన్నతంగా నిలిచిపోయే
మంచితనమే ముద్దు

45) నీటిమీద బుడగలు
నిమిషమే నిలుచునురా
 మనిషి కలలు
నిద్రలోనే కరుగునురా

46) మనకోసం ఆలోచించేవారు
అందరూ మనవాళ్ళే
అందరికోసం ఆలోచించేవారు 
మనకు కావలసినవాళ్ళే

47) విలువలు ఉన్నచోట
అనురాగాలు వెల్లివిరుస్తాయి
మానవత్వం ఉన్నచోట
ఆత్మీయబంధాలు వికసిస్తాయి

48) నీలో ఉన్న
దుర్గుణాలను తొలగించుకో
నీలో దాగియున్న
మానవత్వాన్ని బ్రతికించుకో

49) సోదర భావంతో
కలిసిమెలిసి మెలగాలి
మానవతా విలువలతో
మమతలు పూయించాలి

50) మానవత్వం లేనివాడు
మంచిని చూడలేడు
మానవత్వం మరచినవాడు
మనుగడ సాధించలేడు
51) నీతిని మరువక
న్యాయాన్ని పాటింపుము
ధర్మాన్ని విడువక
జాతిని రక్షింపుము

52) మానవత్వం అంటే
రక్తదానం చేయుట
దానవత్వం అంటే
రక్తపాతం సృష్టించుట

53) మానవత్వం బ్రతికించెను
మాయమవుతున్న విలువలను
గురుత్వము బోధించును
మానవతా విలువలను

54) డబ్బుతో కొనేవాటిని
సుఖాలు అంటారు
డబ్బుతో కొనలేనివాటిని
సంతోషాలు అంటారు

55) మన ఆలోచన 
వెలుగు చూపించాలి
వచ్చే ఆలోచన
చీకట్లను తరిమేయాలి

56) వెలుగులో ఉంటే
నిన్ను అనుసరిస్తారు
చీకట్లో ఉంటే
ఎవరూ అనుసరించరు

57) కలలు కనడం
సహజ లక్షణం
కలలు నెరవేర్చుకోవడం
కార్యసాధకుల లక్షణం

58) తప్పులు చేస్తే
సరిదిద్దడం నేర్చుకో
ఒప్పులు చేస్తే
అభినందించడం తెలుసుకో

59) చేసే పనిమీద
ఇష్టం పెంచుకో
నీమనసు మీద
పట్టు సాధించుకో

60) సంతోషంగా ఉండాలంటే
ఇతరులను సంతోషపరుచు
గొప్పగా బ్రతకాలంటే
శత్రువునైనా పలకరించు

61) బంధాలను తెంచేస్తే
జీవితంలో ఆనందముండదు
అనుబంధాలను మరిస్తే
మనశ్శాంతి మిగలదు

62) ఎదుగుతున్న వారికి
అవకాశాలు ఇవ్వండి
ఏదోరోజు నీకు
నీడనిచ్చి కాపాడు

63) పైకి కనిపించేదంతా
నిజమైనది కాదు
పైకి కనబడనిదంతా
ప్రమాదము కాదు

64) జీవితంలో కొందరు
నటిస్తూ ఉంటారు
జీవితాన్ని మరికొందరు 
నెట్టుకోస్తూ ఉంటారు

65) మానవతా విలువలు
మనుగడకు మార్గాలు
మానవ సంబంధాలే
జీవిత చక్రాలు

66) దానధర్మాలు
చేయడంలో ముందుండాలి
ధర్మాన్ని రక్షించడంలో
వెనకడుగు వేయకుండాలి

67) ధనమే జీవితము
కాదని తెలుసుకోవాలి
సంపాదనే ధ్యేయము
కారాదని గ్రహించాలి

68) అక్రమ సంపాదనకు
స్వస్తి చెప్పాలి
అవినీతి జీవితానికి
చరమగీతం పాడాలి

69) విలువలు లేని
 జీవితం వ్యర్థం
విలువలతోనే
జీవితం పరమార్ధం

70) తల్లిదండ్రులు
జీవితానికి ఆధారాలు
గురు దైవాలు
జీవితానికి చుక్కానిలు

71) దయగల హృదయమే
దేవుని నిలయం
ప్రేమించే హృదయమే
భక్తుని ఆలయం

72) ఎట్టి పరిస్థితుల్లోనూ
అహింసను వీడరాదు
మూగ జీవులను
హింసించరాదు

73) ఆకలిని తీర్చేది
అన్న ప్రసాదము
జ్ఞానాన్ని ఇచ్చేది
అక్షరాభ్యాసము

74) బయటికి కనిపించే
మురికిగుంతల కన్నా
మనసులో నిలిచే
మాలిన్యం మిన్నా

75) శాంతంగా ఉండేవారు
ఆరోగ్యంగా ఉంటారు
సంతోషంగా ఉండేవారు
పదికాలాలు జీవిస్తారు

76) నీ ప్రతిభను
పదిమందికి పెంచు
నీవు పట్టుదలను
పెద్దలనుంచి అనుకరించు

77) అమ్మ ప్రేమ
కళ్ళతో చూడగలం
నాన్న ప్రేమ
కన్నీళ్ళతోనే తెలుసుకోగలం

78) మాట ఇవ్వడం
చాలా సులభమే
మాట నిలబెట్టుకోవడం
కష్టసాధ్యమే

79) అందరికీ నచ్చేటట్లు
ఉండాల్సిన పనిలేదు
అందరూ మెచ్చేటట్లు
నడుచుకోవాల్సిన అవసరమూలేదు

80) లక్ష్యం చేరుకోవాలంటే
అంకితభావం కావాలి
ఆశయం నిర్దేశించుకోవాలంటే
ఆత్మవిశ్వాసం ఉండాలి

81) జీవితం గుణపాఠాలను
 నేర్పుతూనే ఉంటుంది
సహాయసహకారాలను
దాతృత్వం నేర్పుతుంది

82) మనిషిలాగా
అందరూ బతుకుతారు
మహాత్ముడిలాగా
కొందరే బతుకుతారు

83) జీవితం రంగస్థలము
నిరంతరం నటించాల్సిందే
జీవితం ప్రయాణము
ఒంటరిగా బ్రతకవలసిందే

84) నిన్ను తిట్టినప్పుడు
కోపాన్ని ప్రదర్శించకు
నిన్ను పొగిడినప్పుడు
గర్వంతో పొంగిపోకు

85) నేర్చుకునే అంశము
లక్ష్యానికి చేరువచేయాలి
 వదిలేసిన అంశము
ఆశయాన్న బ్రతికించాలి

86) నమ్మకం సాధించడానికి
సంవత్సరాలు పట్టును
నమ్మకం పోగొట్టుకోడానికి
నిమిషము చాలును

87) అక్షర సేద్యలు
గురు భగవానులు
 గౌరవనీయులు పూజ్యనీయులు
మన ఉపాధ్యాయులు

88) అమ్మ జన్మనిస్తే
అక్షరాలునేర్పు గురువు
నాన్న రక్షణనిస్తే
భవిష్యత్తునిచ్చు గురువు

89) తల్లి లేకపోతే
జీవము లేదు
గురువు లేకపోతే
జీవితమే లేదు

90) అజ్ఞానాంధకారాలను
తొలగించును గురువు
విజ్ఞాన జ్యోతులను 
వెలిగించును గురువు

91) చేతులు బాగుంటే
రాతలు బాగుంటాయి
మనసు బాగుంటే
మాటలు బాగుంటాయి

92) కష్టపడి చదువు
సమాజంలో గుర్తింపుదక్కు
ఇష్టపడి చదువు
ఉన్నత స్థానానికెక్కు

93) క్రమశిక్షణ మార్గమును
చూపును గురువు
జీవిత ఆశయమును
బ్రతికించును గురువు

94) మన జీవితాలలో
గురువు వివేకమునింపు
మన బ్రతుకులలో
గురువు వెలుగులునింపు

95) ఎదుటివారి బాగుకొరకు
భాగస్వామ్యం వహిద్ధాం
తోటివారి మేలుకొరకు
కలిసి కృషిచేద్ధాం

96) జగతి వెలుగుకై
కృషిచేయును గురువు
జాతిగౌరవం కొరకై
బ్రతుకును గురువు

97) అక్షరాలు నేర్పేవాడు
ఆది గురువు
విజ్ఞానం అందించేవాడు
విశ్వ గురువు

98) పిల్లల భవితను 
తీర్చిదిద్దేవారు గురువులు
ప్రగతికి బాటలను
వేసేవారు గురువులు

99) గురువులు మార్గదర్శకులు
మంచిమార్గము చూపును
గురువులు నిర్దేశకులు
సుద్దులెన్నో చెప్పును

100) ఉత్తమ వ్యక్తిని
తయారుచేయును గురువు
ఉన్నత వ్యక్తిత్వాన్ని 
కల్పించిను గురువు