పాఠశాల (బాల గేయం)-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

ప్రయోగాల ఆట ఇది
చూస్తారా మీరు అది 
పిల్లలనే కలుపునది 
సృజన లనే పెంచునది.

పుస్తకాలనున్నది
వస్తువులతో నిండినది
పనులతో నేర్పునది 
నిపుణతనే పెంచునది

గురువుగారు మెచ్చునది
విద్యార్థుల సౌభాగ్య మది
ప్రయోగాల నిలయమది
పాఠశాల మన పెన్నిధి.
కామెంట్‌లు