మహా కావ్యానికి క్రెటీరియా సైజు, బరువు కావని తేల్చిన మేటి
ఏ కవి వలన ఈ ప్రపంచం ఇంకో అడుగు ముందుకు వేస్తుందో ఆయన 'మహాకవి' యని వివరించిన ఘనాపాటి
ఎవరూ అక్కరలేదని పారేసిన వాటినే కథావస్తువులుగా ఏరుకొని వాటిని అద్భుత కావ్యాలుగా మలచిన ఘనుడు
రచనలలో లోకం ప్రతిఫలింపజేసి, జాతి జనులు పాడుకొనే మంత్రంగా కవిత్వాన్ని మండించిన సూరీడు
రచయితలు స్వతంత్రంగా ఆలోచించాలని హితువు పలికిన ప్రజ్ఞాశీలి
“నా ఇంటి పేరే ప్రపంచం ప్రజలే నా కుటుంబం” అని నినదించిన ధీశాలి
కవిత్వాన్ని వాస్తవ లోకానికి మళ్లించి, కవితకు అనర్హమైనది ఏదీ లేదని వివరించిన కవిస్రష్ట
సామాన్యుల హృదయస్పందనను వివరించి, వారి సంక్షేమం కోసం తపించిన మహాద్రష్ట
"శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు"యని కార్మిక ధీరులకు జేజేలు పలికిన చైతన్య దీపిక
పేదలు,ధనికులు ఉన్న వర్గ సమాజం నుండి వర్గ భేదాలు లేని సమాజం కోసం నినదించిన నిప్పు కణిక
కవిత్వాన్ని విప్లవీకరించి ఒక నూతన దారిని ఏర్పరచిన ప్రవక్త
తెలుగు సాహిత్యాన్ని నడిపించిన ఈ శతాబ్దపు ప్రయోక్త, చైతన్య నినాదం శ్రీ శ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి