గుడ్డు గుటుక్కుమందామని:- సునీత ప్రతాప్

 పొద్దుగాల పొద్దుగాల లేషిన
 అందర్నీ మేల్కొలిపిన
  ఆకాశంలో  మేఘాల మధ్య
అటు ఇటు ఒకటే పచార్లు చేస్తున్న
 అందరూ ఎండ  వచ్చింది  అంటున్నారు
 బడిగంట గణ గణ ఎప్పుడంటదో చూస్తున్న
 పిల్లలేమో బడికి రారాయె
 టీచర్లందరూ బడికి వస్తున్నరు పోతున్నరు
 వీళ్ళతో  నాకేం పని
 పిల్లలతోనే  నాకు పని
 మధ్యాహ్నం అయ్యింది ఆకలయితుంది
 పిల్లలుంటే  మధ్యాహ్న భోజనం
 అందులో వారానికి  మూడు గుడ్లు
 నాకు కూడా పిల్లలు గుడ్లు ఇచ్చేవారు
 ఎప్పుడు మధ్యాహ్నమవుతుందా
 ఎప్పుడు గుడ్డు గుటుక్కుమందామా
 అని ఎదురు చూసేవాడిని
 ఇప్పుడేమో బడి వుంది పిల్లలు లేరు
 ఇంకా అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాను
 ఇంకా అర్థం కాలేదా నేనెవరినో?
 అదేనండి మీ సూర్యదేవున్నిఅయ్యో!
                    sunithaprathap
                     Teacher, palem.
కామెంట్‌లు