మరో అమ్మగా ప్రేమను పంచుతూ
గురువుగా అక్షరాలు నేర్పుతూ
తప్పులు, తప్పటడుగులు సరిచేస్తూ
బిడ్డల భవిష్యత్తే ధ్యేయంగా
తాను కర్పూరంగా కరిగేవాడే నాన్న
నాన్న ప్రేమ శిఖరం
నాన్న ఆప్యాయత అమృతం
వీపు అంబారిపై ఎక్కించుకుని
కష్టనష్టాలను ఎదుర్కోవడం నేర్పి
సొంత కాళ్లపై నిలబడేలా పెంచే
కనిపించే మహానుభావుడే నాన్న
నాన్న ఓ అద్భుతం
నాన్న తీర్చుకోలేని రుణం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి