గమనం ..!!:- --డా.కె .ఎల్వీ -- హనంకొండ .
నా చిన్నపుడు ,
ద్విచక్ర వాహనం 
' సైకిలు '
ఒక విలాస వస్తువు ,
సామాన్యుడికి 
అందని ద్రాక్షపండు ,
అయిన వారికి 
అదే రవాణా వాహనం !

సైకిలు యుగం 
శిఖరాగ్రం చేరి ....
అది ....
సమాన్యుడి చేతికి ,
అందేసరికి ...
ఉన్నవాళ్ళ _
విలాసవాహనం ,
మోపెడ్ అయింది !

మోపెడ్ల మోజు పెరిగి,
బ్యాంకు రుణాల మేళాలు 
ఊపందుకుని ....
పదిమందికీ _
అందుబాటులోకి వచ్చింది ,
పొలాల్లోకి సైతం ,
దూసుకుపొయింది !

మోపెడ్ల రూపం మారి ,
బైకుల యుగం మొదలై 
బడాబాబులనుండి 
బక్కపీచువరకు ,
ఆయా స్ధాయిల్లో 
రాజ్యమేలుతోంది !

ఆదునిక  సమాజానికి ,
' కారు ' 
విలాసవస్తువైంది ,
దీనితో ___
ఊబకాయం జనానికి 
చేరువైంది ....!
మనిషి మళ్ళీ ...
సైకిలువంక చూస్తున్నాడు ,
ఆరోగ్యాన్ని _
దృష్టిలో ఉంచుకుని,
దానినే _
ఎంచుకోబోతున్నాడు !
సైక్లింగ్ కు _
శ్రీకారం చుట్టబోతున్నాడు !!