మామూలు మానవుడు !?-- సునీతా ప్రతాప్
ఎవరైనా పైకి ఎదగడానికి
ఎన్ని మెట్లయిన
క్రిందీకి దిగుతారు 
కానీ

మరొకరు ఎదగడానికి మాత్రం 
ఒక్క మెట్టు కూడా కిందికి దిగి రారు!?


మరొకరిని
ఎగతాళి చేయడానికి
ఎదుగుతారు !?


ఎదిరించిన వాణ్ని
బెదిరించడానికి ఎదుగుతారు
కానీ

ఎవరిని  ఎదిగించడానికీ
ఎదుగరూ
ఒక మెట్టు కిందికి దిగి రారు !?

కాళికా కూడా
కాలితోనే
రాక్షసునీశిక్షించింది !?
త్రిశూలం చేతిలోనే ఉంది!?

దేవుడు కూడా ప్రత్యక్షమైతే
పది మెట్లు కిందికి దిగి రావాల్సిందే తప్ప

వెయ్యిగుడి మెట్లు ఎక్కి తేనే
ప్రత్యక్షమవ్వడు
దర్శనమిస్తాడు అంతే !?

దీక్ష ప్రదక్షిణ చేస్తేనే ప్రత్యక్ష నవ్వడానికి
దేవుడు కాడు
మామూలు మానవుడు వీడు !?

Sunitapratap
Teacher
8309529273