సృజన దారులు (బాలగేయాం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

ఉగాది వచ్చు డెందుకు?
కాలం తెలిపే టందుకు.

కాలం తెలుసుడెందుకు?
సాగు పాటు చేసేటందుకు.

సాగుబాటు చేసుడెందుకు?
పంటలు వేసే టందుకు.

పంటలు వేసుడెందుకు?
ఆహారం అయ్యేటందుకు.

ఆహార మవుడు ఎందుకు? 
ఆరోగ్యముగ ఉండేందుకు.

ఆరోగ్యం గుండే దెందుకు?
సృజన దారులేసే టందుకు.