ఉట్టి కట్టిన ఉడుత(బాలల నవల):--సమీక్ష: బెహరా ఉమామహేశ్వరరావు (బాల సాహిత్యవేత్త)

 పట్టణంలో చెట్టు పై నివసించే ఉడుత. తానున్న చెట్టును కొట్టేసి అక్కడ  పెద్ద భవనం కడతారు.
   కాని పరిస్థితుల్లో ఉడుత అడవి చేరుతుంది. అక్కడ కాకి పరిచయమై తాను ఉండే చెట్టు కింద 
కొమ్మపై ఉడుత ఉండేందుకు  చోటు నిస్తుంది.
    కాకి, ఉడుతను అడవిలో జంతువులకు పరిచయం చేస్తుంది.అడవి అంతా చూసిన ఉడుత మురిసి పోతుంది. అక్కడ గల అడవి జంతువులను పక్షులను పరిచయం చేసే తీరు రచయిత అద్బుతం
గా వివరించారు. సరళమైన వాక్యాలతో సున్నితంగా పిల్లల మనసుకు తగినట్లు రాయడం రచయిత ప్రత్యేకత. ఉడుతకు కొంగ తో పరిచయమై,తాను
పట్టణం  వెళతానని చెబుతుంది. కాని ఉడుతకు పట్టణ పరిస్థితులు బాగు లేవని వెళ్లవద్దని కొంగను నివారించే విధానం చాలా బాగా రాశారు. ఈ నవలలో పక్షుల గాన సభ, ఏనుగు ఎలుక వంటి పలు జంతువులతో బాలల మనస్తత్వానికి అనుగుణంగా రచన చేశారు.ప్రతి పేజీలో రంగురంగుల అందమైన చిత్రాలు. సరళమైన భాషతో బాలలు చదివేందుకు అనువుగా ఉంది.
రావెళ్ళ బాలసాహిత్యంలో చేయి తిరిగిన రచయిత
అని మరొక్కసారి  నిరూపించుకున్నారు. ప్రతి స్కూలు లైబ్రరీ లోనే గాక ప్రతి విద్యార్థి దగ్గర  ఉండదగిన పుస్తకం. రచయిత రావెళ్ల శ్రీనివాసరావు  అభినందనీయులు.
 ‌‌       ఉ‌ట్టి కట్టిన ఉడుత(పిల్లల నవల)
రచన: డా: రావెళ్ళ శ్రీనివాస రావు
బొమ్మలు: చైతన్య