సీసమాలి పద్యం
ప్రాణ భయమనెంచి పదిలమ్ము తోడను
దాచిపెట్టెను యింట తాళ మేసి,
గత రెండు మాసాలు గడిచెనీ రీతిగా
సంపదలేకను సాగుటెట్లు?,
తాళమ్ము తెరిచారు తాలలేకనిపుడు
ఖచ్చితం పని యైన కాలు కదుపు,
ముక్కు మూతికి మాస్కు ముందుగా ధరియించి
బయటకు వెళ్లుట బాధ్యతెరుగు,
మందులు విందులు మరువాలి యందరూ
పొంచి యుంది బయట బూతమోలె,
పాపికరోనాయె పాకుచు తిరుగును
మానవబాంబులా మనుషులందు,
స్వీయ నిర్భంధమే శ్రీరామరక్షగా
బావించి నడవాలి భవిత యందు,
కాయగూరలు లేక కలవర పడవద్దు
నున్నంత భోంచేసి యుండవలెను,
బతికుంటె తినవచ్చు బావర్చి బిర్యాని
గడుపవలెను పూట కష్టమనక.
తేటగీతి
సాగిపో వలె నిలవీరసైనికులుగ,
దూర దూరమ్ము పాటించ తెలుగు బాధ,
బ్రతుకు గొప్పదని తెలియ భవిత వెలుగు,
కంటిరెప్ప యింటిని కాపుగాయు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి