వరుణుని దయ (బాల గేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
వానలకై ఎదురు చూపులు
చూస్తున్నారిల తల్లిదండ్రులు
 తాతల మాటలు విన్నారు
ఊరి పిల్లలు కలిశారు 

వర్షం కోసం పూజలు 
కప్ప కావిడి తిరుగుళ్ళు 
కప్పల పెళ్ళి చేశారు 
ఇల్లు ఇల్లు తిరిగారు

డబ్బులు కొన్ని కూర్చారు
పాశం వాటితో చేశారు 
దేవుని బండపై పోశారు
పిల్లలు పెద్దలు వచ్చారు

పాశపు విందు తిన్నారు
చెర్లు, కుంటలు నిండాలన్నరు
వాగులు వంకలు పారాలన్నరు
వ్యవసాయమె బలమన్నారు

కామెంట్‌లు