*కోతి మూక - కోళ్ళ విజయం*-(గేయకథ)-{మూడవ భాగం}:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
రంగురంగుల ఆ కోడీ
ప్రేమతోడ తన పిల్లలకు
మేతపెట్టి నీళ్ళుతాపి
సాకుచునుండే భద్రంగా!
 అలా ఉండగా.........
10)
ఊరికి చెంతనె అడవొకటుంది
అందులొ అల్లరి మూకొకటుంది
మూకలొ అన్నీ కోతులెనండీ
వాటికి హద్దులు లేవండీ!
11)
అడవిలొ ఉండే ఆ మూక
తరచుగ ఊరికి వస్తుంది
జనులను తికమక పెడుతుంది
తెగ అల్లరి చేసేస్తుంది!
12)
అన్నం,పప్పూ,కూర గిన్నెలను
ఎత్తుకువెళ్ళీ తింటాయి
పాలు,నీళ్ళు,నూనె లాంటివి
మట్టిలొ వొంపీ వేస్తాయి!!
(సశేషం)
{ఫిబ్రవరి 2008 మొదటి వారంలో TVలో వచ్చిన ఒక వార్త ఆధారముగా}