పదము లోని భావనలకు -పరవశమ్ము హృదయ మొలుకు
మీటగలుగు మానసమును-మే రలేని సృజన చిలుకు
పంచెకట్టు మోహనమ్ము -పండు వంటి నవ్వు తోను
పంచు సిరుల రైతు బిడ్డ-పసిడి చేల వాసి గాను
దోచుకున్న జనం మదిని- తోడు చుండె పాట సొగసు
దొరల గడికి ఎదురు నిల్చు-దొరకె అన్న గారి మనసు
ఏకవీర ఎదిగినాడు- ఏరులాగ నిలిచి నాడు
ఏక మయ్యె గజల్ లహరి- ఏమి భావ మలదినాడు
మబ్బులోన ఏమి ఉంది -మనకు నచ్చు పాట జతుల
మనసు తెలిసి వ్రాసి కవిత- మహిమ తెలుసు కుంటి మిటుల
ఉంగరాలు జుట్టు సొగసు -ఉంది లేవొ పెదవి ఎరుపు
ఉంగరమును విడువలేదు-ఉన్నతమది భాను మెరుపు !!
బీటవారి నట్టి చేలు -పీఠభూమి పీయుషములు
సాటి కవులు మెచ్చినారు-సాద రమును శాలువాలు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి