బొమ్మల పుస్తకం ( బాల గేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

అన్న బడికి పోయాడు
బొమ్మల బుక్కు తెచ్చాడు
బొమ్మలు చూపుతో
చెప్పాడు
తిరిగి చెప్పు మని అన్నాడు
ఉడత బొమ్మను చూపాడు
పండ్లను తినును అన్నాడు
ఏనుగు బొమ్మను చూపాడు
ఏంతో పెద్దది అన్నాడు


ఈగ బొమ్మను చూపాడు
అంతట వాలును అన్నాడు
ఒంటె బొమ్మను చూపాడు 
ఇసుకలో ఉంటుదన్నాడు
ఆవు బొమ్మను చూపాడు
తీయని పాలిస్తుదని అన్నాడు
ఎలుక బొమ్మను చూపాడు
గణపతి వాహనం అన్నాడు 

రంగు రంగుల బొమ్మలు 
చిగురించెను ఊహలు.