పిల్లలు కొద్ది కొద్దిగా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి తల్లిదండ్రుల బాల్యం మీద ఆసక్తి కలుగుతుంది.అలానే మా పిల్లలకీ కలిగింది.మరటువంటి అపూర్వ అవకాశాన్ని నేనొదులుకుంటానా.
నా వీర గాథలన్నీ చిలవలు పలవలుగా వెన్నెల్లో బువ్వలు తినిపించే వేళ ఓ అని చెప్పుకున్నా.కొన్ని రోజులు ఊ కొడుతూ ఆశక్తిగానే విన్నారు.
నా గురించి నేనే చెప్పుకోవడం పైగా అందులో పాపం ఆ చిన్ని బుర్రలకి నమ్మశక్యంగాని విషయాలు ఉండటంతో నిజమా అని అడగటం,నాకేసి అనుమానంగా చూడటం మొదలు పెట్టారు.
ఇక ఇట్లా లాభం లేదని సెలవలకి మా నరసరావుపేట తీసుకెళ్లినప్పుడల్లా స్నేహితుల ఇంటికో,బంధువుల ఇంటికో ,తెలిసిన వాళ్ళ ఇంటికో తీసుకెళ్లటం మొదలుపెట్టా.
అయితే కొందరు మిత్రుల అత్యుత్సాహం వల్ల నా గురించి పిల్లలు తెలుసుకోవటం ఏమో కానీ నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఎదురయ్యేవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి