కాకి ఆదర్శం -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
బువ్వ దొరికిన కాకి 
కమ్మగా పిలుస్తుంది 
కావు కావు మంటూ 
తోటి కాకుల రమ్మంది 

పంచుకొని తిందాము 
రారండి అంటూను 
మంచిమనసు తోటి 
ఆరగింపు చేస్తుంది 

మనుషులకు లేదేమి 
ఇటువంటి బుద్ధి 
తరాలకు కూడేసి 
తోటివారి కడుపుకొట్టె!

ఆదర్శం కాకమ్మలు 
అవేకదా సంఘజీవులు 
ప్రకృతి ఫలసాయం 
పంచుకునే పుణ్యములు!



కామెంట్‌లు