రవళి పాపాయి (బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రవళి నిద్ర లేచింది
రవి కిరణం చూసింది
రా రమ్మని పిలిచింది
పొద్దటి ఎండలో ఆడింది

సుర సుర ఎండా వచ్చింది
బిరబిర ఇంట్లోకి వెళ్ళింది
చన్నీటి స్నానం చేసింది
వేడి వేడి పాలు తాగింది

పెరటి లోకి పోయింది
జామ చెట్టు

ఎక్కింది
రమను ఉమను పిలిచింది
కోతి కొమ్మలాట ఆడింది

అమ్మ పిలుపు విన్నది
పాట పాడుతూ నవ్వింది
అవ్వా తాతా వచ్చారు
హాయిగా ముద్దులు పెట్టారు