అక్షరాలకు అందని నీ ప్రేమ
ఆప్యాయతకు సిసలైన చిరునామా
అక్షరాలు నేర్పిన తొలి గురువు
తప్పటడుగులు సరిచేసిన కల్పతరువు
తనకంటూ కోరికలే లేని కల్పవల్లి
పిల్లల క్షేమం మాత్రమే కోరే మాతృమూర్తి
గుడి అంటూ లేని కనిపించే దైవం
తల్లి ప్రేమకు యావత్ జగత్తు దాసోహం
అమ్మా ఏమిచ్చి తీర్చుకోము నీ రుణం
నీ మాతృ హృదయానికి అంకితం మా జీవితం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి