*ఉదయ్ కిరణ్ కు సాహిత్య పురస్కారం*


 జిన్నారం: ఉస్మానియా తెలుగు రచయితల సంఘం శుక్రవారం నాడు హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా బొల్లారం జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి కొండపల్లి ఉదయ్ కిరణ్ కు "గాథ సృజన సంయమి" పురస్కారం అందించినట్లు పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు.
       తెలుగులో 25 మినీ కథలను రచించినందుకు ఈ పురస్కారం అందించారు.
       తల్లి విలువ, ఒత్తిడి, ఉపాయం, ఆలోచన, మార్పు, పక్షులు, మానవత్వం, విశ్వాసం, చెట్లు, సమయం, అమ్మ మాట, నిజాయితీ, స్టార్, నమ్మకం, గౌరవం, పబ్జి గేమ్, సంతృప్తి, మార్కులు, మోసం, మంచి మనసు, ప్రోత్సాహం, నిదర్శం, ఆధారం, రైతు, స్నేహం" అనే శీర్షికలతో సందేశాత్మక కథలు రచించాడు.
      "గాథ సృజన సంయమి" పురస్కారం పొందిన ఉదయ్ కిరణ్ ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగీలాల్, ఇతర ఉపాధ్యాయులు, పట్టణవాసులు, తోటి విద్యార్థులు అభినందించారు.



కామెంట్‌లు