చిన్న దానం - పెద్దబహుమతి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు


  ఒకడి పేరు రాము. రెండో వాడి పేరు సోము. వీరు మంచి స్నేహితులు. వీళ్లిద్దరు ఒకరోజు  స్కూలుకు వెళుతున్నారు.  దారిలో వీరికి పది రూపాయాలు నోటు దొరికింది. "అరేయ్! చెరో ఐదు రూపాయలు పంచు కుందాంరా" అన్నాడు సోము.  "వద్దు స్కూల్ ప్రేయర్ లో చెప్పి ఎవరివైతే వారికిద్దాం" అన్నాడు రాము. అలాగే ప్రార్ధన సమయంలో మైకులో చెప్పారు. ఎవరు వచ్చి తీసుకోలేదు. హెడ్మాస్టర్ వద్దకు వెళ్లి "ఎవరివైతే వారికివ్వండి" అని ఇవ్వబోయారు. ఆయన తీసుకోకుండా "మీరే ఉంచుకోండిరా" అన్నాడు.  సోము తన ఐదు రూపాయలు తీసుకుని  లాలీపాప్ కొనుక్కొని తిన్నాడు.  రాము  చిల్లర మార్చి గుడి ముందు కూర్చుని  భిక్షాటన చేసే  వారికి తలో రూపాయి ఇచ్చాడు. తెల్లారి ప్రార్ధన సమయంలో  "డబ్బు ఏంచేసారు?" అడిగాడు హెడ్మాస్టర్ గారు.  విషయం చెప్పారు. హెడ్మాస్టర్ రాముని పిలిచి అందరి ముందు ఎంతో మెచ్చుకున్నాడు. స్కూల్లో మంచి విద్యార్థిగా ఎంపిక చేసి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చాడు.  మనం రూపాయి దానం చేస్తే ఏదో ఒక రూపంలో వంద రూపాయలు వస్తాయని రాముతో పాటు పిల్లలందరూ  తెలుసు కున్నారు.

కామెంట్‌లు