గడ్డి చిలుక (బాలల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఆకు చాటు చిలుక
ఆకు పచ్చ చిలుక
అందమైన చిలుక
ఆకు లాంటి చిలుక

చెట్టు మీది చిలుక
చిన్న చిన్న చిలుక
బొమ్మ లాంటి చిలుక
రెమ్మల్లోన ఆ చిలుక

పుల్ల లాంటి రె

క్కలతో
కనుల ముందు లేస్తూ
పుడమి మీది ఎగురుతూ
పులకరించేటి చిలుక

పిల్లల పెద్దల చూపుల్లో
అది ఒక్క గడ్డి చిలుక
పెద్దలు పెట్టిన దానిపేరు
గొల్ల భామ దాని నామం

కామెంట్‌లు