అక్షరాంజలి:-మంజీత కుమార్, బెంగళూరు

అక్షరాలు అతని నేస్తాలు
సామాన్యులు అతని ఆప్తులు

కవితలు అతని ఉచ్వాస
కళలు అతని నిశ్వాస

అతని జీవితం సాహిత్యానికి అంకితం
అతని ప్రతీ పదం మానవ జీవనానికి పాఠం

సాహితీ తోటలో వికసించిన అక్షర కుసుమం
సందేశాత్మక కవితలతో ఆలోజింపజేసిన కవి హృదయం

మనుషుల్లో దేవుడిని చూడమన్న మహా మనిషి
అందరూ ఒకరేనని చాటిన దివ్య ఋషి

రవీంద్రుడి అక్షరసేద్య ఫలితం జాతీయగీతం
విశ్వకవి మనసున వికసించినదే గీతాంజలి పుష్పం

బెంగాళీల వారసుడు
భారత జాతికి గర్వకారుడు

దేశభక్తిని చాటిన నిజమైన పౌరుడు
గాంధీ మెచ్చిన సిసలైన భారతీయుడు



కామెంట్‌లు