అతడు ..!!:-డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 నిరాశను 
నడ్డిమీద తన్ని 
ఆశాజీవిగా అతడు 
అడుగులు -
ముందుకేస్తున్నాడు !
వెన్నెముకగల మనిషిగా 
ఎన్నెన్నో అవరోధాలను 
దాఁటుకుంటూ --
అత్యాశలకు లొంగక 
తనకష్టాన్నే నమ్ముకుని ,
శ్రమ మార్గాన్నే ఎంచుకుని ,
తనదైన మార్గంలో 
తృప్తిగా బ్రతుకుతున్నాడు !
శ్రమ దోపిడీకి ----
ఎదురుగా నిలిచి ,
శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించి ,
సుఖజీవన మార్గాన్ని ...
సుస్థిరం చేసుకుంటున్నాడు !
ప్రశ్నించే గొంతును -
పదును పెట్టుకుంటున్నాడు ,
ఆశయాలకు అడ్డుపడే 
అత్యాశలను  ...
పాతాళానికి తొక్కేప్రయత్నం లో,
తలమునకలై ఉన్నాడతడు !
ఆశ -అత్యాశల 
అవగాహనా ఉద్యమానికి 
సన్నద్ధుడౌతున్నాడు అతడు !!