ప్రాణదాత: -తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఆరోజు ఆదివారం కావటంతో చిన్న పెద్ద అందరికీ ఆటవిడుపు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదికపై త్యాగరాయ సంగీత విభావరి జరుగుతున్నది గొప్ప గొప్ప కూడా ఆహ్వానించారు వారిలో డాక్టర్ జయరామ్ కూడా అతని భార్యని వెంటబెట్టుకుని గుడి కి వచ్చాడు కార్యక్రమం జరుగుతున్నది తెలిసిన వాళ్ళు అంతా డాక్టర్ జయరాం ని పలకరిస్తున్నారు ఆయన భార్య శారద కూడా కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు ఆదివారం వస్తే చాలు ఎక్కడికైనా సరదాగా వెళ్దామని శారద అడగగానే జయరామ్ భార్యని వెంటబెట్టుకుని తీసుకువస్తాడు.
అన్నమయ్య కీర్తన చాలా అద్భుతంగా వాడుతున్నారు చివరిలో సన్మాన కార్యక్రమం ఉన్నదని డాక్టర్ కూడా చివరి వరకు ఉండమన్నారు ఇంతలో హాస్పటల్ నుంచి అర్జెంటుగా రావలసిందిగా చేయడానికి ఫోన్ కాల్ వచ్చింది .
భార్యని చివరి వరకు ఉండి ఆటోలో ఇంటికి వెళ్ళమని చెప్పాడు నేను అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్లాలి కారు తీసుకుని వెళ్తున్నాం అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు.
భర్త అలా అలా మధ్యలో వెళ్ళిపోవటం శారదకు చాలా కోపంగా ఉంది సరదాగా గడపాలని ఇద్దరం కలిసి వస్తే మధ్యలో ఈ ఫోన్లు వస్తాయి ఎక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉండనివ్వరు అంటూ విసుక్కుంది.
కార్యక్రమం పూర్తి కాగానే శారద ఇంటికి వచ్చి చేరింది డాక్టర్ జయరామ్ రాత్రి 12 అయినా ఇంటికి రాలేదు శారదకు భోజనం చేయాలనిపించలేదు కోపంతో అలాగే వెళ్లి పడుకుంది.
అర్ధరాత్రి ఎప్పటికో వచ్చాడు జయరామ్ స్నానం చేసి డ్రెస్ మార్చుకుని భోజనం చేయకుండానే పడుకున్నాడు తెల్లవారింది శారద అలిగి భర్తతో మాట్లాడలేదు .
అది కాదు సరదా ఒక్కసారి నా మాట విను నీతో సరదాగా గడపాలని నాకు మాత్రం ఉండదా అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళటం కొంచెం ఆలస్యమైతే ఒక నిండు ప్రాణం గాలిలో కలిసి పోయేది అంటూ భార్యకు చెప్పాడు.
హాస్పిటల్లో లో మీరు ఒక్కరే డాక్టర్ అనుకుంటున్నారా ఆ దిక్కుమాలిన రోగిని కాపాడటానికి మరో డాక్టరు ఎవరూ లేరా నాకన్నా నా మీకు వాళ్లే ముఖ్యమా అంటూ విరుచుకుపడింది.
అది కాదు శారద నీవు కాలేజీ అయిపోగానే ఇంటికి వస్తావు నేను అలా కాదు ఎంతోమంది ప్రాణాలు కాపాడే డాక్టర్ని నేను బాధ్యతగా ప్రవర్తించాలి పొరపాటు వల్ల ప్రాణాపాయం జరిగితే ఎంత పాపం నీకేం తెలుసు ఉ నన్ను అర్థం చేసుకో అంటూ బ్రతిమిలాడాడు. వచ్చే ఆదివారం నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మనం సరదాగా గడుపుదాం అంటూ భార్యని శాంత పరిచాడు. ఆ ఆదివారం కూడా జయరామ్ కి హాస్పిటల్ కి వెళ్లక తప్పలేదు రేపు మన పెళ్లి రోజు మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు మా అమ్మ నాన్న ఇస్తారు అందరం కలిసి ఇ ఏదైనా హోటల్ లో గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం మీకు ముందే చెబుతున్నాను ఈసారి మాత్రం మీరు నా మాట వినకపోతే మీతో కలిసి ఉండటం నావల్ల కాదు అండి.
ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాట ఎందుకు శారద అలాగే నేను నేను ఇంటి వద్దే ఉంటాను నీ కోరిక ప్రకారం మనం హోటల్లో పార్టీ చేసుకుందాం అన్నాడు .
ముందు రోజు భార్యని షాపింగ్ కి తీసుకెళ్ళి గోల్డ్ నెక్లెస్ కొనిపెట్టాడు ఆమెకు ఇష్టమైన చీర సెలెక్ట్ చేసుకో మన్నాడు శారద చాలా సంతోషంగా ఉంది.
మర్నాడు శారద తల్లిదండ్రులు జయరామ్ తల్లిదండ్రులు అంతా వచ్చారు ఇంట్లో హడావిడిగా ఉంది మరో గంటలో అంతా కలిసి హోటల్ కి బయల్దేరారు కేక్ కట్ చేయటం పూర్తయింది అదే సమయంలో ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు హడావిడిగా శారద పట్టు చీర కట్టుకొని నెక్లెస్ పెట్టుకొని అందంగా అలంకరించుకుని ఆమె స్నేహితులు కూడా వచ్చారు జయరామ్ ఎంతకీ రాలేదు అందరికీ కోపం వచ్చింది ఇలాంటి టైం లో జయరామ్ బయటకు వెళ్ళటం నచ్చలేదు.
శారదకు ఫోన్ చేసి మీరంతా భోజనాలు చేసి ఇ ఇంటికి వెళ్ళండి నేను రావటం బాగా ఆలస్యం అవుతుంది అంటూ ఫోన్ పెట్టేసాడు.
శారదకు ఏడుపు ఒక్కటే తక్కువైంది జయరామ్ డాక్టర్ కదా అతని అవసరాలు అందరికీ ఉంటాయి తప్పించుకొని రాగలడు అని తల్లిదండ్రులు చెప్పారు అయినా శారదా కోపం తగ్గలేదు.
తెల్లవారుజాము కి గాని జయరామ్ ఇంటికి రాలేదు శారద అలిగి పుట్టింటికి వెళ్ళటానికి సూట్కేసు పట్టుకుని సిద్ధంగా ఉంది జయరామ్ ఆమెకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు మీ దృష్టిలో నేను ఎందుకు పనికిరాని దాన్ని నాకు సంతోషాన్ని సరదా మనిషి ఇవ్వలేరు భర్త ఉన్న ఒంటరి బ్రతుకు అయిపోయింది ఆ దిక్కుమాలిన ఆసుపత్రిలోనే గడపండి దిక్కుమాలిన వాళ్ళందరికీ సేవలు చేస్తూ మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకోండి మీకు కావలసింది అదేగా నేను ఏమైపోతే మీకేమిటి మీతో కలిసి ఉండటం నావల్ల కాదు కన్నీళ్లు పెట్టుకొని బాధపడింది.
నేనొక్కడినే నా సరదాల కోసం వెళ్తున్నా నా నిన్ను కాదని సుఖ పడాలి అనుకోవడం లేదు ఎప్పుడూ భర్త నీ వెంటే ఉండాలనుకోవడం నీ స్వార్థం ప్రజా సేవ అన్నాక ప్రజలకి అంకితమై పోవాలి వాళ్ల ప్రాణాలు నిలబెట్టినప్పుడు వాళ్లంతా సంతోషిస్తారు నేనే దేవుడను అని చేతులెత్తి నమస్కరిస్తారు.
నీకు ప్రాణం విలువ ఏం తెలుసు ఉ నేను వెళ్లకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది సమయానికి వాళ్లని హాస్పిటల్ కి చేర్చి నాకు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయట పడ్డారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా మీ అన్న వదిన మన ఫంక్షన్ కోసం రావాలని వస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్పు అంటావా అన్నాడు ఆవేశంగా.
శారద చేతిలో సూట్ కేస్ జారీ కింద పడింది ఏమిటి మీరు అంటున్నది మా అన్న వదిన కి ఏమైంది వారికేమి ఈ ప్రమాదం లేదు కదా త్వరగా చెప్పండి నేను వెంటనే వెళ్లి చూడాలి అంటూ ఆందోళనగా విలవిలలాడింది.
జయరామ్ శారదను వెంటబెట్టుకుని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు శారద అన్నా వదిన తలకి గాయాలతో బెడ్ పై పడుకొని ఉన్నారు వాళ్లను చూడగానే దుఃఖం వచ్చింది నీలాంటి డాక్టర్ ఉండబట్టే ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నాయి హాస్పిటల్ మొత్తానికి నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా మా కొడుకు కోడలు ప్రాణం పోసి పునర్జన్మ ఇచ్చావ్ అంటూ శారద తల్లిదండ్రులు జయరామ్ చేతులు పట్టుకొని చిన్నవాడివి అయినా నీకు చేతులెత్తి మొక్కల అనిపిస్తున్నది ప్రాణ గండం నుంచి ఇద్దరిని బయటపడ్డ వేశావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అన్నారు.
ఆ ఐ యాం సారీ నన్ను కూడా క్షమించండి .
ఎవరో అభాగ్యులను కొని మిమ్మల్ని అనరాని మాట అన్నాను వాళ్ళు నా వాళ్ళని తెలిశాక ప్రాణం విలువ ఏమిటో తెలిసింది అందరూ మిమ్మల్ని దేవుడిలా చూస్తుంటే మీకు భార్యను అయినందుకు నాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది అంటూ జయరామ్ చేతులు పట్టుకుంది.
ప్రాణదాత అంటే పదిమందికి ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ గా గా నా బాధ్యత అందరూ సమానులే నీ వాళ్ళని తెలిశాక ఎంతగా బాధ పడ్డావో ప్రాణం విలువ అందరికీ ఒకటేనని తెలుసుకుంటే మంచిదంటూ భార్యని దగ్గరగా తీసుకున్నాడు.
శారద అతని వృత్తికి ఎప్పుడు అడ్డు రాలేదు.