అక్షర మాల గేయాలు* --*చ' అక్షర గేయం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 చక్కని  చిట్టి పాపాయికి
చదువు ఆటలు చాలా ఇష్టం
చందమామ కథలంటుంది
చదరంగం ఆట అంటుంది
చల్లని జాబిలి వైపు చూసి
చరఖా తిప్పేది ఎవరంటుంది
చలాకి యైన ప్రశ్నలు వేస్తూ
చక చక పాఠం చదివేస్తుంది