షాడోలు (క్రీనీడలు ) నెట్ విద్యార్థి :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
నెట్ సముద్రమున 
మునకలు వేసిన 
విద్యార్థిని కన
పుస్తకము రక్ష చేసె ఉమా!

పొట్టను నొక్కెను 
లింకులను కనెను 
వాట్సాప్ గ్రూప్ల ను 
సింబలు  గుర్తులు కక్కె ఉమా!

అమెజాన్ ఆర్దరు 
శారీస్ బోర్డరు 
నకిలీ చార్టరు 
ఎంతో గందరగోళ ముమా!

సినిమా మేటరు 
సింగిలు చీటరు 
హారీ పాటరు 
ఆన్ లైన్ క్రైములు అబ్బొ
 ఉమా!

పుస్తకమేడ్చెను 
మస్తక మంతను 
ఖరాబు అయ్యెను 
బాలల హక్కులు ఇవా ఉమా!


కామెంట్‌లు